ETV Bharat / bharat

ఇద్దరు ఐసిస్​​ అనుమానితులు అరెస్ట్​

author img

By

Published : Oct 8, 2020, 10:54 PM IST

బెంగుళూరుకు చెందిన ఇద్దరు ఐసిస్​ అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. యువతను ప్రేరేపించి వారిని సిరియాకు పంపడానికి నగదు వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు.

Two Terror Suspects arrests by NIA officials in Bengaluru
ఇద్దరు ఐఎస్​ఐఎస్​ అనుమానితులు అరెస్టు: ఎన్​ఐఏ

బెంగుళూరులో ఉంటున్న ఇద్దరు ఐసిస్​​ సంబంధిత వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. యవతను ప్రేరేపిస్తూ, వారిని సిరియాకు పంపేందుకు నగదు బదిలీ చేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

కీలక దర్యాప్తులో భాగంగా..

తమిళనాడులోని రామంతపురంలో నివసిస్తున్న అహ్మద్​ అబ్దుల్​ కేదర్(40), బెంగుళూరులో నివాసం ఉంటున్న ఇర్ఫాన్​ నాసిర్(33)ను అనుమానితులుగా అధికారులు గుర్తించారు. వారి దగ్గర నుంచి ఎలాక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో టెర్రర్​ గ్రూప్​న​కు సంబంధించిన ఓ డాక్టర్​ను అరెస్టు చేసిన ఎన్​ఐఏ అధికారులు ఈ దర్యాప్తు చర్యలను ముమ్మరం చేశారు.

చెన్నైలోని ఓ బ్యాంకులో కేదార్​ వ్యాపార విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడని, నాసిర్​.. బియ్యం వ్యాపారం చేస్తున్నాడని ఎన్​ఐఏ అధికారులు తెలిపారు.

Two Terror Suspects arrests by NIA officials in Bengaluru
ఇర్ఫాన్​ నజీర్​

పదిరోజులు...

ఇద్దరు అనుమానితుల్ని ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టగా... 10 రోజులు వారిని దర్యాప్తు చేయమని ఎన్​ఐఏకు కోర్టు తెలిపింది.

అహ్మద్​ కేదార్​

అప్పుడే తెలిసింది

సెప్టెంబర్​ 19న ఎన్​ఐఏ ఓ కేసు దర్యాప్తును ప్రారంభించింది. ఆ దర్యాప్తులో భాగంగానే బెంగుళూరులోని ఐసిస్​ గురించి ఎన్​ఐఏకు కొన్ని విస్తుపోయే నిజాలు తెలిశాయి. డాక్టర్​ అరెస్టుతో ఈ నిజాలు బయటకొచ్చాయని అధికారులు పేర్కొన్నారు.

డాక్టర్​ని దర్యాప్తు చేయగా.. 2013-14లో ఐఎస్​ఐఎస్​లో చేరడానికి సిరియా వెళ్లిన వారి వివరాలు తెలిశాయని అధికారులు తెలిపారు.

కురాన్​ సర్కిల్

ఎన్ఐఏ చేపట్టిన దర్యాప్తులో కేదార్​, నాసిర్​ 'హిజ్బ్-ఉట్-తెహ్​రీర్' అనే సంస్థకి చెందిన వారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కురాన్​ సర్కిల్​ పేరిట బెంగుళూరు ముస్లింలను సిరియాకు పంపడానికి ఈ ఇద్దరు పనిచేస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు స్పష్టం చేశారు. అనుమానితుల చర్యల వెనుక ఉన్న కుట్రను తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: నక్సలైట్ల మధ్య అంతర్యుద్ధం- ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.