ETV Bharat / bharat

2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత - మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల న్యూస్

మహారాష్ట్ర, హరియాణాలో సోమవారం జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఎర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు మహారాష్ట్రలో 3 లక్షలు , హరియాణాలో 75 వేల మంది పోలీసులను మోహరించనున్నారు.

2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
author img

By

Published : Oct 19, 2019, 7:40 PM IST

సోమవారం జరగబోయే శాసన సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర, హరియాణాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. శాంతి భద్రతల పర్వవేక్షణకు చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం, నగదు రవాణాను అరికట్టేందుకు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా పెంచారు అధికారులు.

మహారాష్ట్రలో 3 లక్షల మంది...

మహారాష్ట్రలో 3 లక్షల మందికిపైగా పోలీసులను మోహరించనున్నారు అధికారులు. 2 లక్షల మంది రాష్ట్ర పోలీసులు కాగా, కేంద్ర నుంచి 350 కంపెనీల సిబ్బంది, సీఆర్​పీఎఫ్​, సీఐఎస్​ఎఫ్, నాగాలాండ్ మహిళా పోలీసు దళాల సేవలను వినియోగించుకోనున్నారు.

మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావం ఉన్న గడ్చిరోలి జిల్లాలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా నిరంతరం శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

హరియాణాలో 75 వేల మంది...

సోమవారం జరిగే పోలింగ్​ ప్రశాంతంగా ముగిసేందుకు హరియాణాలో 75 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరూ ఉల్లంఘించకుండా పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్​ను ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఈనెల 24న ఫలితాలు వెలువడతాయి.

ఇదీ చూడండి: 'అసెంబ్లీ పోరు': ముగిసిన ప్రచార పర్వం.. 21న ఎన్నికలు

Mumbai, Oct 19 (ANI): 'National crush' Kartik Aaryan was seen outside a recording studio in Mumbai. Keeping his look casual, Kartik flashed big smile to the shutterbugs. He will be next seen in 'Pati, Patni Aur Woh' along with Bhumi Pednekar and Ananya Panday. 'Pyaar Ka Punchnama' famed Nushrat Bharucha was also seen in the city. She wore a white crop top with uber chic pants and kept her look like 'girl next door'. Nushrat was last seen in 'Dream Girl' along with Ayushmann Khurrana. Actor Shraddha Kapoor was seen with family post dinner date. She kept her look simple yet cool. Meanwhile, Sunny Deol's son Karan Singh was also seen at Juhu.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.