ETV Bharat / bharat

దంతెవాడలో ఎన్​కౌంటర్​- ఇద్దరు నక్సల్స్​ హతం - ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు నక్సల్స్‌ హతమయ్యారు. గత అర్ధరాత్రి కుత్రేం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు, నక్సల్స్​ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

దంతెవాడలో ఎన్​కౌంటర్​- ఇద్దరు నక్సల్స్​ హతం
author img

By

Published : Sep 14, 2019, 10:04 AM IST

Updated : Sep 30, 2019, 1:35 PM IST

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లను మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. కుత్రేం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గత అర్ధరాత్రి ఎదురుకాల్పులు జరిగినట్లు ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు.

కాసేపటి తర్వాత అవతలి వైపు నుంచి కాల్పులు నిలిచిపోయాయని, ఘటనాస్థలంలో రెండు మృతదేహాలను గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు. మృతులను లచు మాండవి, పొదియాగా గుర్తించినట్లు చెప్పారు. వారిద్దరూ మలంగీర్‌ ప్రాంత కమిటీ సభ్యులని పేర్కొన్నారు. ఒక్కొక్కరి తలపై 5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

ఘటనాస్థలం నుంచి 9 ఎమ్​ఎమ్​ ఇటలీ తయారీ పిస్టోల్‌, 12 బోర్‌ రైఫిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. దంతెవాడ శాసనసభ ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా భద్రతాదళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో దంతెవాడ ఎమ్మెల్యే, భాజపా నేత భీమా మండావిని నక్సల్స్‌ కాల్చి చంపారు.

Ranchi (Jharkhand), Sep 13 (ANI): Jharkhand Chief Minister Raghubar Das, who attended the special one-day session of Jharkhand Assembly in the newly built Vidhan Sabha building in Ranchi, said people of the state has sent a message to all Assembly members to rise above partisan politics to take Jharkhand to new heights of development. Governor Draupadi Murmu convened the special session of Jharkhand Assembly in the newly inaugurated Vidhan Sabha building which has been built at a cost of Rs 465 crore. The building was inaugurated by Prime Minister Narendra Modi on Sep 13 in presence of CM Das.

Last Updated : Sep 30, 2019, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.