పాముకు ఒకేవైపు ఒకటికన్నా ఎక్కువ తలలు ఉండటాన్ని ఫొటోలు, సినిమాల్లోనే చూసి ఉంటారు. కానీ మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కల్యాణ్ నగర్లో ఒకేవైపు రెండు తలలు ఉన్న అరుదైన పాము కనిపించింది.
గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొంత మంది గ్రామస్థులు నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై చిన్న పామును చూశారు. దానికి ఒకేవైపు రెండు తలలు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. స్థానిక జంతుశాస్త్ర నిపుణుడు హరీష్ జాదవ్‌కు సమాచారం అందించారు.
రెండు తలల చిన్న పామును జాదవ్, సందీప్ పండిట్ కాపాడి 'వార్ రెస్క్యూ ఫౌండేషన్' అనే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అత్యంత విషపూరితమైన నాలుగు రకాల పాముల జాతుల్లో ఇదీ ఒకటని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలా రెండు తలలు ఒకే వైపు ఉండటం జన్యు లోపాలతో అరుదుగా జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ అరుదైన రెండు తలల పామును సంరక్షించి.. పరిశోధనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: కర్ణాటక:పండ్లు, పూలపై చిత్ర కళాప్రదర్శన అదుర్స్..!