ETV Bharat / bharat

తమిళనాడులో భవనం కూలి ఇద్దరు మృతి - తమిళనాడు తాజా వార్తలు

తమిళనాడులో కురుస్తోన్న భారీ వర్షాలకు కోయంబత్తూర్​లో ఆదివారం రాత్రి ఓ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు.

Two dead in building collapse in Tamilanadu and five rescued
తమిళనాడులో భవనం కూలి ఇద్దరు మృతి
author img

By

Published : Sep 7, 2020, 10:48 AM IST

Updated : Sep 7, 2020, 11:09 AM IST

తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కోయంబత్తూర్​ చెట్టి వీధిలో ఆదివారం రాత్రి ఓ భవనం కుప్పకూలింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయి.

తమిళనాడులో భవనం కూలి ఇద్దరు మృతి

భారీ వర్షాలకు ఈదురు గాలులు తోడు కావడం వల్ల భవనం అకస్మాత్తుగా నేలకూలింది. శిథిలాల్లో 8 మంది చిక్కుకోగా.. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఏడుగురిని వెలికితీశారు. వారిలో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: గుజరాత్​లో భారీ వర్షాలు- రహదారులు జలమయం

Last Updated : Sep 7, 2020, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.