ETV Bharat / bharat

మరో నిర్భయ: బాలికపై అత్యాచారం.. ఆపై క్రూరంగా..

author img

By

Published : Aug 7, 2020, 5:58 AM IST

దిల్లీలో ఘోరమైన అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికపై దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టి తర్వాత చిత్రహింసలకు గురిచేశాడు. చిన్నారి ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

Two days after 12-year-old beaten, sexually assaulted, one held
మరో నిర్భయ: బాలికపై అత్యాచారం.. ఆపై క్రూరంగా దాడి

నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చే మరో ఘోరమైన అత్యాచార ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికపై ఓ దుండగుడు అత్యాచారం చేసి.. ఆ తర్వాత తల, ముఖం, మర్మాంగాల్ని తీవ్రంగా గాయపరిచాడు. పేగుల్లోనూ గాయాలయ్యాయి. బాలిక తల్లిదండ్రులు కూలిపనికి వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు.

ఓ వ్యక్తి అరెస్టు

పశ్చిమ దిల్లీలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘోరంపై మహిళా సంఘాలు, పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీటీవీల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కృష్ణన్‌ (33) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నేరనేపథ్యం ఉన్న ఆ వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

పరామర్శ

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆసుపత్రి వద్దకు వెళ్లి బాధితురాలి తల్లిదండ్రులకు ధైర్యంచెప్పారు. తూర్పు దిల్లీ ఎంపీ గౌతం గంభీర్‌, దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌, మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా తదితరులు అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.