పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు తెగించింది పాక్ సైన్యం. ఈ ఘటనలో ఇద్దరు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు సమాచారం. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
షాపుర్, కిర్ణీ ప్రాంతాల్లో పాక్ సైనికులు కాల్పులు జరిపారని.. వాటిని దీటుగా తిప్పికొట్టినట్లు అధికారులు తెలిపారు.