బంగాల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను వారి పైఅధికారి కాల్చిచంపాడు. ఉత్తర దినాజ్‌పుర్ జిల్లా రాయ్‌గంజ్‌లోని మాల్దాఖండ్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో మహిందర్ సింగ్, అనుజ్ కుమార్‌పై ఇన్స్పెక్టర్ ఉత్తమ్ సూత్రధర్ కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో మహిందర్, అనుజ్ అక్కడికక్కడే మరణించారు. ఉత్తమ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
