ETV Bharat / bharat

వావ్​ తనీషా.. రెండున్నరేళ్లకే రికార్డుల వేట - రెండున్నేరళ్ల తనిష

రెండున్నరేళ్ల వయస్సులోనే.. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను చెప్పి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది కర్ణాటకకు చెందిన తనీషా. అంతేకాకుండా ఎన్నో జీకే ప్రశ్నలకు చకచకా సమాధానాలు కూడా చెప్పేస్తోందీ చిన్నారి.

Two and Half-year-old girl Tanisha Enters the India book of Record
వావ్​ తనిష.. రెండున్నరేళ్లకే రికార్డుల వేట
author img

By

Published : Aug 2, 2020, 12:42 PM IST

రెండున్నరేళ్ల వయస్సులో పిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉంటారు. కనీసం అఆఇఈలు కూడా సరిగ్గా పలకడం రాని వయస్సది. కానీ కర్ణాటకకు చెందిన తనీషా.. రెండున్నరేళ్లకే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చకచకా చెప్పేస్తోంది. దీంతో ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది.

వావ్​ తనీషా.. రెండున్నరేళ్లకే రికార్డుల వేట

తల్లి సహాయంతో..

తనీషా తల్లి ఓ బ్యాంకు ఉద్యోగిని. తండ్రి కేపీటీసీఎల్​లో పనిచేస్తుంటారు. వీరు శివమొగ్గలో నివాసముంటున్నారు. భోజనం సమయంలో తనీషాకు జీకే నేర్పించేది ఆ తల్లి. అవన్నీ తనీషాకు ఇట్టే గుర్తుండిపోతాయి. అప్పటినుంచి ఎన్నో ప్రశ్నలకు చకచకా సమాధానాలు కూడా చెప్పేస్తోందా చిన్నారి.

Two and Half-year-old girl Tanisha Enters the India book of Record
తనీషా

ఆది, సోమ.. వంటి వారాల పేర్లతో మొదలైన తనీషా ప్రయాణం.. నెలలు, సంవత్సరాలు, దేశం, రాష్ట్రాలు-రాజధానుల వరకు చేరింది.

తల్లిదండ్రులతో తనీషా

తనీషాలోని ప్రతిభను గుర్తించిన తల్లి.. ఆమె తెలివితేటలను ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను చెబుతున్న తనీషాను వీడియో తీసి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​కు పంపించింది. రెండున్నరేళ్ల చిన్నారిలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​.. తనీషాకు సర్టిఫికెట్​ను అందించింది.

సర్టిఫికేట్​

ఇదీ చూడండి:- ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.