ETV Bharat / bharat

బాలిక సజీవదహనం- పార్టీ కార్యకర్తలు ఇద్దరు అరెస్ట్ - G. Murugan and K. Kaliyaperuman.

తమిళనాడులో ఓ బాలికను దారుణంగా హత్య చేసిన ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Two ADMK functionaries arrested for setting 15 year old girl on fire
ఏడీఎంకే
author img

By

Published : May 11, 2020, 1:00 PM IST

తమిళనాడు ముండియంబక్కం ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల బాలికను సజీవ దహనం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తలను విల్లుపురం పోలీసులు అరెస్టు చేశారు.

నిన్న రాత్రి ఘటన

నిన్న రాత్రి బాధితురాలి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున పొగ బయటకు రావడం గమనించారు స్థానికులు. లోపలకు వెళ్లి చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మంటలు ఆర్పి, ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

మేజిస్ట్రేట్​ వద్ద బాలిక ఇచ్చిన మరణ వాంగ్మూలం ప్రకారం నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. వీరిని ఏడీఎంకేకు చెందిన మురుగన్, కలియపెరుమన్​గా గుర్తించారు.

తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ ముండియంబక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: భారత్​లో కరోనా కొత్త రికార్డ్- ఒకేరోజు 4,213 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.