ETV Bharat / bharat

రైతు పోరుతో సంబంధమున్న ట్విట్టర్​ ఖాతాలు బంద్! - ట్విట్టర్​

దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతుల ఖాతాలతో పాటు మరికొన్నింటిని నిలిపివేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​. వీటిల్లో ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్​ ఖాతా కూడా ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Twitter 'withholds' multiple accounts linked to farmers' protest
రైతు నిరసనలతో సంబంధం- ట్విట్టర్​ ఖాతాలు నిలిపివేత
author img

By

Published : Feb 1, 2021, 5:25 PM IST

Updated : Feb 1, 2021, 6:22 PM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ అనేక ఖాతాలను సోమవారం నిలిపివేసింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనలకు సంబంధం ఉన్న అనేకమంది రైతుల ఖాతాలు, రైతు సంఖాల ఖాతాలు ఇందులో ఉన్నాయి.

ఈ జాబితాలో కిసాన్​ ఏక్తా మోర్చా, బీకేయూ ఏక్తా ఉర్గహన్​ ఉన్నాయి. వీటితో పాటు పలువురు వ్యక్తులు, సంస్థల ఖాతాలను కూడా నిలిపివేసింది ట్విట్టర్​.

న్యాయపరమైన డిమాండ్​ వచ్చినప్పుడు ట్విట్టర్​ ఇలా ఖాతాలను 'విత్​హోల్డ్'​ చేస్తుంది.

ప్రసార భారతి సీఈఓ ఖాతా కూడా..

ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్​ వెంపటి ట్విట్టర్​ ఖాతాను కూడా ట్విట్టర్​ నిలిపివేసింది. ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Twitter 'withholds' multiple accounts linked to farmers' protest
ప్రసార భారతి సీఈఓ ట్విట్టర్​ ఖాతా

అధికారిక యంత్రాంగం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ విధంగా స్పందించినట్టు ట్విట్టర్​ వెల్లడించింది.

అయితే తమ చర్యలకు కారణాలు తెలపాలని ట్విట్టర్​ను ప్రసార భారతి డిమాండ్​ చేసింది.

శశి శేఖర్​ ఖాతా నిలిపివేతపై భాజపా ఎంపీ, పార్లమెంటరీ కమిటీ(డేటా రక్షణ బిల్లు) ఛైర్మన్​ మీనాక్షి లేఖి మండిపడ్డారు. సరైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్​ను డిమాండ్​ చేయడం వల్లే ఆయన ఖాతాను తొలగించారని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్రమ మోదీకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్న ఖాతాను తొలగించాలని శశి ట్విట్టర్​ను కోరారని.. బదులుగా ఆయన ఖాతానూ సామాజిక మాధ్యమ దిగ్గజం నిలిపివేసిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 'మేం రైతులం.. ఎదురుచూపులు మాకు అలవాటే!'

Last Updated : Feb 1, 2021, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.