ETV Bharat / bharat

'చైనాలో లద్దాఖ్​' వివాదంలో ట్విట్టర్​ క్షమాపణలు - భారత్ వర్సెస్ ట్విట్టర్

Twitter apologies
ట్విట్టర్​ క్షమాపణలు
author img

By

Published : Nov 18, 2020, 5:12 PM IST

Updated : Nov 18, 2020, 5:47 PM IST

17:09 November 18

పార్లమెంటరీ ప్యానెల్​కు ట్విట్టర్ లిఖితపూర్వక అఫిడవిట్​

'చైనాలో లద్దాఖ్'​ను చూపి భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు ట్విట్టర్​ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్​కు లిఖితపూర్వక అఫిడవిట్​ అందజేసినట్లు కమిటీ ఛైర్​పర్సన్ మీనాక్షి లేఖి తెలిపారు.  

లద్దాఖ్​ జియో ట్యాగింగ్​ను తప్పుగా చూపినందుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్​పై ట్విట్టర్​ గోప్యత విభాగం అధికారి డేమియెన్​ కరీన్ సంతకం చేశారు. నవంబర్​ 30లోపు ఈ తప్పిదాన్ని సరిచేస్తామని హామీ ఇచ్చింది ట్విట్టర్.  

ప్యానెల్​ ఆదేశాలు..

లద్దాఖ్​ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ.. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఈ విషయంపై అఫిడవిట్​ను సమర్పించాలని అక్టోబర్ 28న ట్విట్టర్​ను ఆదేశించింది. మరుసటి రోజు మౌఖికంగా క్షమాపణలు తెలిపిన ట్విట్టర్​... తమ సంస్థ భారత దేశ సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని పునరుద్ఘాటించింది.

ఇదీ చూడండి: 'చైనాలో లద్దాఖ్​'​పై ట్విట్టర్​కు మరిన్ని చిక్కులు!

Last Updated : Nov 18, 2020, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.