రాజస్థాన్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ తెలియరాలేదు. వారు కూడా చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
ఇదీ జరిగింది..
బూందీ జిల్లాలోని కమలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సుమారు 40 మంది పడవలో ప్రయాణమయ్యారు. పరిమితికి మించిన ప్రయాణికులు, పడవ సరైన కండిషన్లో లేకపోవడం వల్ల నది మధ్యలోకి వెళ్లే సరికి అదుపుతప్పి బోల్తాపడింది. 20 నుంచి 25 మంది వరకు ఈదుకుంటూ నదీతీరానికి చేరుకున్నారు. ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. ఇందులో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
మోదీ ఆవేదన..
పడవ ప్రమాదంలో 12 మంది చనిపోవడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ప్రమాదం తర్వాత దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.