పొరుగు దేశం పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ చేసిన ట్వీట్‌పై దీటుగా స్పందించింది భారత్. ట్విట్టర్లో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులను ఉటంకిస్తూ ఇమ్రాన్... ఓ వీడియో పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ప్రధాని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలుగా పేర్కొంటూ.. ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇమ్రాన్. అయితే అది బంగ్లాదేశ్‌కు సంబంధించిన వీడియోగా తేలింది. ఈ నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేక పోస్టుపై ట్విట్టర్ అధికారులు ఇమ్రాన్‌ను వారించారు. అనంతరం ఆయన ఖాతా నుంచి ఆ సందేశాన్ని తొలగించారు.
"ఇమ్రాన్ ట్విట్టర్ పోస్ట్ తప్పుడు వార్త అని గుర్తించాం. ట్విట్టర్‌కు నివేదించాం. ఇమ్రాన్ తన ఖాతా నుంచి ఆ సందేశాన్ని తర్వాత తొలగించారు."
- రవీశ్‌కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ఇమ్రాన్ ట్వీట్ వ్యవహారంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందించారు. ఏడేళ్ల నాటి బంగ్లా వీడియోను పోస్ట్ చేసి భారత్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాక్ తన పాత విధానాలను మార్చుకోలేదని వ్యాఖ్యానించారు.
-
Repeat Offenders...#Oldhabitsdiehard pic.twitter.com/wmsmuiMOjf
— Syed Akbaruddin (@AkbaruddinIndia) January 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Repeat Offenders...#Oldhabitsdiehard pic.twitter.com/wmsmuiMOjf
— Syed Akbaruddin (@AkbaruddinIndia) January 3, 2020Repeat Offenders...#Oldhabitsdiehard pic.twitter.com/wmsmuiMOjf
— Syed Akbaruddin (@AkbaruddinIndia) January 3, 2020
తమ పోలీస్ శాఖ పైన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అసత్య ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు విభాగం. పాక్ ప్రధాని ట్వీట్ తమ రాష్ట్రానికి చెందినది కాదని తమ అధికారిక బ్లాగ్‌లో రాసుకొచ్చింది.
"ఇది యూపీకి చెందినది కాదు. 2013 మేలో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఘటన."
-ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ విభాగం వివరణ
ఇదీ చూడండి: 'పౌర' రగడ: 'కాంగ్రెస్.. శరణార్థులపై నాటి మాట ఏమైంది?'