పౌరచట్టంపై అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు. అయితే భాజపా చట్టం చేస్తే కాంగ్రెస్ ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌వి మోసపూరిత రాజకీయాలని, అధికారంలోకి రావాలన్న తాత్కాలిక ప్రయోజనాన్ని నెరవేర్చుకునేందుకే 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. పౌరచట్టంపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.
"2018 రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో నా వద్ద ఉంది. ఇందులో 27 హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరహక్కులను కల్పిస్తామని, పునరావాస చర్యలు తీసుకుంటామని నాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది."
-జీవీఎల్ నరసింహరావు
గతంలో సీఎంగా ఉన్న సమయంలో పాక్ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం కల్పించాలని పేర్కొంటూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు గహ్లోత్ విన్నవించారని గుర్తుచేశారు జీవీఎల్.
'నాటి నిర్ణయమే'
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్... పౌరచట్టం అంశమై కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు గుప్పించారు. పౌరచట్టంపై వ్యతిరేక ప్రచారం చేస్తూ ముస్లింలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని వ్యాఖ్యానించారు. పౌరచట్ట సవరణ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయమేనని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: 'నవకల్పనల దిశగా యువ శాస్త్రవేత్తలు ముందుకెళ్లాలి'