ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్దోయి-ఉన్నావ్ హైవేపే ఉన్న టోల్‌ప్లాజా సమీపంలో రాంగ్ రూట్లో వచ్చిన వ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. వ్యాన్ పూర్తిగా దగ్ధమయింది. అందులో ఎంతమంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.