ETV Bharat / bharat

టీఆర్​పీ స్కామ్​ కేసులో రిపబ్లిక్​ టీవీ సీఈఓ అరెస్ట్​ - రిపబ్లిక్​ టీవీ సీఈఓ

టీఆర్​పీ అవకతవకల కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రిపబ్లిక్​ టీవీ సీఈఓను ఈ రోజు ఉదయం అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.

Republic TV CEO Arrest
టీఆర్​పీ స్కామ్​ కేసులో రిపబ్లిక్​ టీవీ సీఈఓ అరెస్ట్​
author img

By

Published : Dec 13, 2020, 10:55 AM IST

Updated : Dec 13, 2020, 11:38 AM IST

కొద్ది రోజుల క్రితం వెలుగుచూసిన టెలివిజన్​ రేటింగ్స్​ పాయింట్స్​ (టీఆర్​పీ) కుంభకోణంలో రిపబ్లిక్​ టీవీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) వికాస్​ ఖంచందానిను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. సెలవు దినం రోజున ఏర్పాటు చేసే ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. సీఈఓ అరెస్ట్​కు వ్యతిరేకంగా రిపబ్లిక్​ టీవీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

రిపబ్లిక్‌ టీవీ పశ్చిమ విభాగం డిస్ట్రిబ్యూషన్‌ హెడ్‌ ఘన్‌శ్యామ్‌ సింగ్‌ను పోలీసులు గతనెలలోనే అదుపులోకి తీసుకోగా.. ఈ నెలారంభంలో ఆయనకు బెయిల్‌ లభించింది.

ఈ కేసును విచారిస్తున్న క్రైమ్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ (సీఐయూ) ఇప్పటికే 12 మందిని అరెస్ట్​ చేసి విచారిస్తోంది. టీఆర్‌పీల విషయంలో కొన్నిఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్​) ఇప్పటికే పలు మీడియా సంస్థలపై కేసులు నమోదు చేసింది. కొంతమందికి డబ్బులు ఇచ్చి.. తమ ఛానళ్లు చూసేలా చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చూడండి: టీఆర్​పీ కుంభకోణం: రంగంలోకి ఈడీ- కేసు నమోదు

Last Updated : Dec 13, 2020, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.