ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో 20 మంది మంత్రుల​ రాజీనామా

author img

By

Published : Mar 9, 2020, 6:04 PM IST

Updated : Mar 10, 2020, 6:48 AM IST

Trouble mounts for Congress
మధ్యప్రదేశ్​ ప్రభుత్వంలో అలజడి

23:55 March 09

20 మంది కేబినెట్​ మంత్రుల రాజీనామా..

మధ్యప్రదేశ్​ రాజకీయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ రెబల్​ ఎమ్మెల్యేల అదృశ్యం నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఇంటిలో భేటీ అయ్యారు కేబినెట్​ మంత్రులు, ముఖ్యనేతలు. సుదీర్ఘ చర్చల అనంతరం మొత్తం 20 మంది కేబినెట్​ మంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను ఆమోదించారు ముఖ్యమంత్రి.  

త్వరలోనే పూర్తిస్థాయి కేబినెట్​ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే హుమాంగ్​ సింఘర్​ తెలిపారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలంతా కలిసే ఉన్నారని.. జ్యోతిరాదిత్య సింధియా కూడా తమతోనే ఉన్నారని పేర్కొన్నారు.  

23:18 March 09

కేబినెట్​ మంత్రుల రాజీనామా

మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర కేబినెట్​లోని మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. అతి త్వరలోనే నూతన కేబినెట్​ ఏర్పడుతుందని సమాచారం.

19:44 March 09

ఇంటికి చేరిన సింధియా...

జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడే దిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్​ రెబల్​ ఎమ్మెల్యేలు జ్యోతిరాదిత్య మద్దతుదారులని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

19:17 March 09

భాజపా శాసనసభా పక్షం సమావేశం...

మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో భాజపా వేగంగా పావులు కదుపుతోంది. రేపు పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. 17 మంది కాంగ్రెస్​ రెబల్​ ఎమ్మెల్యేలు అదృశ్యమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

19:15 March 09

కమల్​నాథ్​ ఇంట్లో అత్యవసర భేటీ

అధికార కాంగ్రెస్​ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు అదృశ్యం అయిన క్రమంలో ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఇంట్లో నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్..​ సీఎం ఇంటికి చేరుకున్నారు. 

18:40 March 09

బెంగళూరు రిసార్ట్​కు రెబల్​ ఎమ్మెల్యేలు..

మధ్యప్రదేశ్​ అధికార కాంగ్రెస్ పార్టీ రెబల్​ ఎమ్మెల్యేలు 17 మంది బెంగళూరు నగర శివార్లలోని ఓ ప్రైవేట్​ రిసార్ట్​కు చేరుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

18:29 March 09

సింధియాను కలవలేదు: కమల్​నాథ్​

రాజ్యసభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి కమల్​నాథ్​ నేడు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్తుపై చర్చించారు. అయితే.. జోతిరాదిత్య సింధియాతో భేటీ అయినట్లు వచ్చిన వార్తలను ఖండించారు.  

ఆదివారం రాత్రి దిల్లీ వెళ్లిన కమల్​నాథ్​ ఈనెల 12 తర్వాతే రాష్ట్రానికి వస్తారని ముందుగా అనుకున్నప్పటికీ.. తాజా పరిణామాల నేపథ్యంలో హుటాహుటిన భోపాల్​ చేరుకున్నారు. పలువురు మంత్రులూ ప్రైవేటు విమానాల్లో భోపాల్​ చేరుకుంటున్నారు.  

18:16 March 09

పీసీసీ చీఫ్​గా జ్యోతిరాదిత్య సింధియా!

మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత జోతిరాదిత్య సింధియాను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

17:55 March 09

17 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు గల్లంతు

మధ్యప్రదేశ్​ ప్రభుత్వంలో అలజడి చెలరేగింది. అధికార కాంగ్రెస్​ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల ఆచూకీ గల్లంతవటం కలకలం రేపుతోంది. వీరంతా పార్టీ ప్రధాన నేత జోతిరాదిత్య సింధియాతో ఉన్నట్లు అనుమానిస్తున్నారు నేతలు. ప్రస్తుతం సింధియా ఫోన్​ స్విచ్ ఆఫ్​ వస్తున్నట్లు తెలిపారు.  

ప్రస్తుతం కమల్​నాథ్​ ప్రభుత్వానికి 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 230 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి నాలుగు స్థానాలు మాత్రమే కమల్​నాథ్​ ప్రభుత్వానికి ఎక్కువగా ఉన్నాయి. అందులో 114 కాంగ్రెస్​, బీఎస్​పీ 2, సమాజ్​వాదీ పార్టీ ఒకటి, నలుగురు స్వతంత్రులు. 

Last Updated : Mar 10, 2020, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.