ETV Bharat / bharat

'కరోనా రహిత రాష్ట్రంగా త్రిపుర!'

త్రిపురలో కరోనా సోకిన రెండో బాధితుడికీ తాజాగా చేసిన పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. ఫలితంగా త్రిపురను కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించారు ముఖ్యమంత్రి. తొలి కరోనా బాధితురాలు ఏప్రిల్​ 16నే కోలుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్​ కేసులు లేవు.

Tripura becomes coronavirus-free state
కరోనా రహిత రాష్ట్రంగా త్రిపుర
author img

By

Published : Apr 24, 2020, 8:57 AM IST

త్రిపుర కరోనా రహతంగా మారినట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి విప్లవ్​ కుమార్​ దేవ్​. రాష్ట్రంలోని ఇద్దరు బాధితులు కోలుకున్నట్లు వెల్లడించారు. తాజాగా రెండో బాధితుడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్​గా వచ్చిన అనంతరం ట్వీట్​ చేసిన దేవ్​.. రాష్ట్రం కరోనా రహితంగా మారిందని పేర్కొన్నారు.

ప్రజలంతా తప్పనిసరిగా భౌతిక దూరం నిబంధనలు పాటించాలని, ఇంట్లోనే ఉండాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు.

Tripura becomes coronavirus
త్రిపుర సీఎం ట్వీట్​

'' అప్​డేట్​.. త్రిపురలోని రెండో కరోనా బాధితుడికి వరుస పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. ఫలితంగా.. రాష్ట్రం కరోనా రహితంగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ ప్రజలంతా ఇంట్లోనే ఉండండి. భౌతిక దూరం పాటించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.''

- విప్లవ్​ కుమార్​ దేవ్​, త్రిపుర ముఖ్యమంత్రి.

త్రిపురలో మొదటి కరోనా కేసు ఏప్రిల్​ 6న నమోదైంది. గువాహటి నుంచి వచ్చిన ఆ మహిళకు కరోనా సోకగా ఏప్రిల్​ 16న కోలుకొని.. డిశ్చార్జి అయింది. అదే ఏప్రిల్​ 16న రాష్ట్రంలోని ఓ జవానుకు కరోనా నిర్దరణ అయింది. ఇతనికి గురువారం నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి కేసుల్లేవు. అయితే.. రెండో బాధితునికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు అధికారులు.

రాష్ట్రంలో ప్రస్తుతం 111 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. మరో 227 మందిని క్వారంటైన్​లో ఉంచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.