ETV Bharat / bharat

'అమర వైద్యుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!' - doctors died of covid in india

మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు అమర జవాన్లతో సమానంగా 'జాతీయ గౌరవం' ఇవ్వాలి అంటూ ప్రధానికి లేఖ రాసింది ఐఎంఏ. వారిపై ఆధారపడిన కుటుంబాలకు న్యాయం చేయాలని కోరింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వైద్యుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అభ్యర్థించింది.

Treat doctors losing lives in COVID fight at par with martyrs of armed forces: IMA to PM
'అమరవైద్యుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలి!'
author img

By

Published : Aug 31, 2020, 4:13 PM IST

కొవిడ్-19తో మృతి చెందిన ఆరోగ్య సిబ్బంది కుటుంబాలను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​(ఐఎంఏ). వారి త్యాగాలను గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని కోరింది. కరోనా నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నంలో.. సొంత ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు.. యుద్ధభూమిలో మరణించిన అమరవీరులతో సమానంగా జాతీయ గౌరవం దక్కాలని పేర్కొంది.

అమర వైద్యుల కుటుంబాల కోసం ఇప్పటివరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు.. లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందలేదని తెలిపింది ఐఎంఏ. మరికొన్ని వారాల్లో భారతదేశం కరోనా కేసుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచేలా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఈ సమయంలో ఆరోగ్య సిబ్బంది పాత్ర అత్యంక కీలకం కాబట్టే ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొంది .

"అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న వేళ కావాలంటే వైద్యులు భయపడి ఇంట్లో కూర్చోవచ్చు. కానీ, అలా చేయలేదు. దేశానికి సేవ చేయడానికి ధైర్యంగా ముందడుగు వేశారు. కరోనాతో పోరాడుతూ మృత్యు ఒడిలోకి చేరిన వైద్యులపై ఆధారపడిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వైద్యుల జీవిత భాగస్వామి, లేద కుటుంబంలో ఒకరికి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కల్పించాలి. ఆరోగ్య కార్యకర్తల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి. "

- ఐఎంఏ లేఖ సారాంశం

ఇప్పటివరకు 87,000 పైగా ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడ్డారని లేఖలో పేర్కొంది ఐఎంఏ. దాదాపు 573 మంది ప్రాణాలు కోల్పోయారన్న ప్రభుత్వ గణాంకాలను ప్రస్తావించింది.

వైద్యుల్లో 2,006 మందికి వైరస్​ సోకగా 307 మంది మరణించారని గుర్తుచేసింది ఐఎంఏ.

ఇదీ చదవండి: కరోనా కాలంలో ఓనమ్ వేడుకలు ఇలా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.