ట్రాన్స్జెండర్లకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారసత్వ భూమిలో వారికీ సమాన హక్కు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్ప్రదేశ్ రెవెన్యూ కోడ్- 2006లో సవరణలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం పలికింది.
తాజా సవరణల ప్రకారం.. ట్రాన్స్జెండర్లనూ భూ యజమాని కుటుంబంలో సభ్యులుగా గుర్తించాలని తెలిపిన ప్రభుత్వం.. ఆస్తి పంపకాల విషయంలో వారికి కూడా సమాన హక్కు కల్పించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు యూపీ కొత్త రెవెన్యూ కోడ్ సవరణ చట్టం-2020లో సెక్షన్-4(10), 108(2), 109, 110లలో కూడా పలు మార్పులు చేశారని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: 36-40 నెలల్లో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి