పంజాబ్ పటియాలాలో వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ జీఎస్ చీమా మృతి చెందారు. ఇద్దరు ఎన్సీసీ విద్యార్థులకు గాయాలయ్యాయి.
పిపిస్ట్రెల్ వైరస్ ఎస్డబ్ల్యూ 80 విమానంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తుండగా అకస్మాత్తుగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. ఈ ఘటనపై వైమానిక దళ అధికారులు విచారణకు ఆదేశించారు.
ఇదీ చూడండి: 'దావూద్ ఇబ్రహీం హత్యకు చోటారాజన్ యత్నం'