ETV Bharat / bharat

ఆ ఆసుపత్రిలో 21 మంది వైద్య సిబ్బందికి కరోనా

భారత్​లో కరోనా మహమ్మారి వైద్య సిబ్బందినీ వదలటం లేదు. బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు ఈ వైరస్ బారిన పడుతుండటం కలవరపెడుతోంది. తాజాగా దిల్లీ, ముంబయి నగరాల్లో వైద్య సిబ్బందికి వైరస్​ సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

mh_mum_corona_jaslok
వైద్య సిబ్బందికి కరోనా
author img

By

Published : Apr 19, 2020, 1:15 PM IST

దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ వైద్య సిబ్బందికీ వైరస్​ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని చాలా చోట్ల వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ముంబయి జస్​లోక్​ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులు, 16 మంది నర్సులకు కరోనా సోకింది.

ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన ముగ్గురు కరోనా బాధితుల నుంచి వైద్య సిబ్బందికి వైరస్ సంక్రమించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీరందిని క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మహా నగరంలోనే అధికం..

ఒక్క ముంబయిలో ఇప్పటికే 2,509 కేసులు నమోదు కాగా.. 125 మంది మరణించారు. 281 మంది కోలుకున్నారు. వీరికి చికిత్స అందించిన కేఈఎం ఆసుపత్రితోపాటు ఓక్​హార్డ్​, ఫోర్టిస్, సుశ్రుష, సైఫీ, సాయి తదితర ఆసుపత్రిల్లోనూ వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

దిల్లీలోనూ..

దిల్లీలోని లేడీ హార్డింగ్​ వైద్య కళాశాలలో ఇద్దరు వైద్యులు, ఆరుగురు నర్సులకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వారిని అదే ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా వీరితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు.

దేశరాజధానిలో 1,893 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు 42 మంది మరణించగా.. 72 మంది కోలుకున్నారు.

గుజరాత్​లో భారీగా కేసులు..

గుజరాత్​లో కరోనా మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులో 228 కేసులు నమోదుకాగా.. మొత్తం సంఖ్య 1,604కు పెరిగింది. కొత్త కేసుల్లో 140 అహ్మదాబాద్​లోనే నమోదు కాగా.. ఆ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 1,002కు చేరింది. గుజరాత్​లో మొత్తం 58 మంది మరణించారు.

ఇండోర్​లో తీవ్రంగా..

మధ్యప్రదేశ్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలో 1,407 మంది కరోనా బాధితులు ఉండగా.. 70 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన ఇండోర్​ జిల్లాలో 890 కేసులు నమోదు కాగా.. 49 మంది మరణించారు.

ఇదీ చూడండి: దేశంలో 500 దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.