ETV Bharat / bharat

రఫేల్​ మోహరింపుపై వాయుసేన ఉన్నతాధికారుల చర్చ - రఫేల్​ యుద్ధ విమానాలు

చైనాతో సరిహద్దు ఉద్రిక్తలపై చర్చించేందుకు ఈ నెల 22న వైమానిక దళ ఉన్నతాధికారులు సమావేశంకానున్నారు. ఈ నెల చివర్లో దేశానికి రానున్న రఫేల్​ యుద్ధ విమానాల మోహరింపు, వాటి పనితీరుపైనా ఈ కమాండర్స్​ కాన్ఫరెన్స్​లో చర్చించనున్నారు.

Top IAF brass to meet to discuss China border situation, rapid Rafale deployment this week
రఫేల్​ రాకపై వాయుసేన ఉన్నతాధికారుల సమావేశం
author img

By

Published : Jul 19, 2020, 4:06 PM IST

రెండు రోజుల వైమానిక దళ కమాండర్స్​ కాన్ఫరెన్స్​ ఈ నెల 22న ప్రారంభంకానుంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులు, ఈ నెల చివర్లో దేశానికి రానున్న రఫేల్​ యుద్ధ విమానాల మోహరింపుపై ఈ సమావేశంలో కమాండర్లు చర్చించనున్నట్టు వాయుసేన అధికారి తెలిపారు. ముఖ్యంగా చైనాతో ఉద్రిక్తతలపై వైమానిక దళాధిపతి మార్షల్‌ రాకేశ్​ కుమార్​ సింగ్​​ భదౌరియా సహా ఏడుగురు కమాండర్​-ఇన్​- చీఫ్​లు ఈ భేటీలో పాల్గొంటారని వివరించారు.

ఇదీ చూడండి:- ఆ సముద్రం మీ సొత్తు కాదు: చైనాకు భారత్​ హెచ్చరిక

చైనాతో విభేదాల నేపథ్యంలో వాయుసేన తన అత్యాధునిక యుద్ధ విమానాలు అన్నింటినీ సరిహద్దు వెంబడి మోహరించింది. మిరాజ్​-2000, సుఖోయ్​-30 సహా ఇతర యుద్ధ విమానాలు నిత్యం గస్తీ కాస్తున్నాయి.

వైమానిక దళం ఎంతగానో ఎదురుచూస్తున్న రఫేల్​ యుద్ధ విమానాలు ఈ నెలాఖరుకు ఫ్రాన్స్​ నుంచి దేశానికి చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల మోహరింపు, వాటి పనితీరుపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.