ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్​ అగ్రనేతలు

బిహార్​ ఎన్నికల ప్రచారానికి 30 మంది స్టార్​ క్యాంపైనర్స్​తో కూడిన జాబితాను కాంగ్రెస్​ విడుదల చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మన్మోహన్​ సింగ్​, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్​ అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు.

Top Congress Party leaders to campaign in Bihar
బిహార్​ ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్​ అగ్రనేతలు
author img

By

Published : Oct 10, 2020, 7:36 PM IST

బిహార్​ ఎన్నికల సమరానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. కాంగ్రెస్​ కూడా తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి.. 30మంది స్టార్​ క్యాంపైనర్స్​తో కూడిన జాబితాను రూపొందించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​-ప్రియంక గాంధీలు త్వరలో ప్రచారాల్లోకి దిగనున్నరు. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి కూడా పంపించినట్టు తెలుస్తోంది.

ప్రచారకర్తల జాబితాలో.. సీనియర్​ నేతలు గులామ్​ నబీ ఆజాద్​, శక్తిసిన్హ్​ గోహిల్​, షకీల్​ అహ్మద్​, రణ్​దీప్​ సుర్జేవాలా తదితరులు ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్​ గహ్లోత్​, భుపేష్​ బఘేల్​, కెప్టెన్​ అమరీందర్​ సింగ్​లను కూడా రంగంలోకి దించింది కాంగ్రెస్​.

ఇదీ చూడండి:- బిహార్​ బరి: వామపక్షాలు సత్తా చాటేనా?

బిహార్​ ఎన్నికల కోసం ఆర్​జేడీ, వామపక్షాలతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసింది కాంగ్రెస్​. 243 శాసనసభ స్థానాలకు గానూ 70 సీట్లల్లో పోటీ చేయనుంది.

బిహార్​ ఎన్నికలు.. ఈ నెల 28, నవంబర్​ 3,7వ తేదీల్లో.. మూడు దఫాలుగా సాగనున్నాయి. అదే నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి- బిహార్​ బరి: తేజస్వీ ఓటమే లక్ష్యంగా భాజపా వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.