మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో దారుణం చోటు చేసుకుంది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చూసుకోమన్నందుకు.. కన్న తల్లినే హత్య చేశాడు ఓ కిరాతకుడు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే..
తల్లి విమల బాయ్ (50), కొడుకు సంతోశ్ పాటిల్ (32)కు మధ్య ఇటీవల ఉద్యోగం విషయంలో గొడవలయ్యాయి. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని కొడుకును వారించారు మిమలా బాయ్. అది నచ్చని యువకుడు.. కన్నపేగు బంధాన్ని విస్మరించాడు. బట్టలు ఉతికే కర్ర (వాషింగ్ పాడిల్)తో కొట్టి ఆమెను హత్య చేశాడు.
సోమవారం ఈ ఘాతుకానికి పాల్పడి.. గురువారం అర్ధ రాత్రి తల్లి శవాన్ని స్థానికంగా ఉన్న ఓ గుంతలో పడేశాడు.
గుంత నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఓ క్రైమ్ సీరియల్ చూసి హత్యకు తెగబడ్డట్లు పోలీసుల దర్యప్తులో అంగీకరించాడు నిందితుడు.
ఇదీ చూడండి:చండీగఢ్‌లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి