ETV Bharat / bharat

'మూడు మాకొద్దు.. రెండు భాషలే ముద్దు!'

విద్యావిధానంలో మూడు భాషల సూత్రం పాటించాలన్న కేంద్రం ప్రతిపాదనను తోసిపుచ్చింది తమిళనాడు. రాష్ట్రంలో ఎప్పటిలాగే రెండు భాషల సూత్రమే కొనసాగుతుందన్నారు సీఎం పళనిస్వామి. తమిళం, ఆంగ్లంలో మాత్రమే విద్యా బోధన జరుగుతుందని, హిందీని అమలుచేసేది లేదని స్పష్టం చేశారు.

tn-govt-rejects-three-language-formula-in-new-nep-says-will-follow-existing-two-language-policy
'మూడు మాకొద్దు.. రెండు భాషలే ముద్దు!'
author img

By

Published : Aug 3, 2020, 4:09 PM IST

జాతీయ విద్యా విధానం-2020లో కేంద్రం ప్రతిపాదించిన మూడు భాషల సూత్రాన్ని(ప్రాంతీయ భాష, ఆంగ్లం, హిందీ) తమిళనాడులో అమలుచేసేది లేదన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి. అన్నాడీఎంకే పార్టీ అందుకు అంగీకరించదని స్పష్టం చేశారు.

తమిళనాడు... దశాబ్దాలుగా రెండు భాషల( తమిళం, ఆంగ్లం) సూత్రాన్నే పాటిస్తోంది. ఇకపై కూడా ఆ రెండు భాషల్లోనే బోధన కొనసాగిస్తుందని, అందులో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చిచెప్పారు పళనిస్వామి. ప్రాంతీయ భాష, ఆంగ్లంతో పాటు కచ్చితంగా హిందీ భాషలో బోధించమని రాష్ట్రాలను ఆదేశించడపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు.

"దేశమంతా మూడు భాషల బోధనా సూత్రాన్ని పాటించమనడం బాధాకరం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై పునరాలోచించాలి."

-పళనిస్వామి, తమిళనాడు సీఎం

ఇదీ చదవండి: కరోనా కలిపిన హిందూ- ముస్లిం రక్షా బంధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.