తమిళనాడులోని జాతీయ టీబీ ఇన్స్టిట్యూట్కు (ఎన్ఐఆర్టీ) బీసీజీ వ్యాక్సిన్ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి లభించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పరీక్షలను ప్రారంభించింది సంస్థ. వృద్ధుల్లో వ్యాక్సిన్ ఏవిధంగా పనిచేస్తుందో తేల్చేందుకు పరిశోధనలు షురూ చేసింది.
60 ఏళ్లు పైబడిన వృద్ధులపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తోంది ఎన్ఐఆర్టీ. వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధులపై కరోనా ప్రభావం చూపడం లేదని నిరూపించే లక్ష్యంతో ఈ పరిశోధనను నిర్వహిస్తున్నారు. బీసీజీ ద్వారా వృద్ధుల్లో మరణాల రేటు తగ్గే అవకాశాలను ఈ పరిశోధన బయటపెట్టనుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకుతుందా లేదా, వ్యాక్సిన్ తీసుకోని వృద్ధులతో పోలిస్తే వైరస్‌తో పోరాడే సామర్థ్యం వారి శరీరంలో పెరిగిందా అనే దిశగా అధ్యయనం సాగనుంది.
ఈ పరిశోధన కోసం అవసరమైనంత సమయాన్ని తీసుకుంటామని చెప్పింది సంస్థ. ఆరు నెలలకు పైగానే పరిశోధన కొనసాగుతుందని వెల్లడించింది. వృద్ధుల్లో బీసీజీ వ్యాక్సిన్ పనిచేస్తే కరోనా నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందని ఇంతకుముందే ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.
ఇదీ చూడండి: ఒకే కుటుంబంలోని ఆరుగురిని హత్య చేసిన సోదరులు!