చెన్నైలోని పాత చాకలి పేటలో కొన్నిరోజులుగా పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు ముస్లిం మహిళలు. మతసామరస్యాన్ని చాటిచెప్పేలా భాగ్యలక్ష్మి అనే తొమ్మిది నెలల గర్భిణికి సీమంతం చేశారు.
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్న వేదికపైనే భాగ్యలక్ష్మికి సీమంతం చేశారు. పూలజడ కుట్టి, అలంకరించి వేడుక జరిపారు. సీఏఏ వ్యతిరేక నినాదాలు ముద్రించిన సంచులలో వాయినాలు ఇచ్చుకున్నారు.
హిందూ ముస్లిం మత సామరస్యాన్ని తెలియజేసేందుకే ఈ వేడుకను నిరసన వేదికపై జరిపేందుకు తాము అంగీకరించామని భాగ్యలక్ష్మి, ఆమె భర్త విఘ్నేశ్ తెలిపారు. పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని భాగ్యలక్ష్మి నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతలు- షా రాజీనామాకు డిమాండ్