ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో తెరుచుకోనున్న థియేటర్లు - tamilnadu cm K Palaniswami news

తమిళనాడులో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు నవంబర్‌ 10 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం పళనిస్వామి అధికారిక ప్రకటన చేశారు.

TN allows schools, colleges, cinemas to resume from Nov
తమిళనాడులో తెరుచుకోనున్న థియేటర్లు
author img

By

Published : Oct 31, 2020, 8:54 PM IST

కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, జంతుప్రదర్శన శాలలు, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, సబర్బన్‌ రైలు సేవలు.. తమిళనాడులో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ నవంబర్‌ 10 నుంచి అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. ప్రతి చోటా కచ్చితంగా కొవిడ్‌ ప్రామాణిక నిబంధనలను పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

9 నుంచి 12వ తరగతి విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. 50 శాతం సీట్లతోనే సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు కనువిందు చేయనున్నాయి. అయితే కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.