బంగాల్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు పూజలు, ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుష్రత్ జహాన్ దుర్గ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని చర్చనీయాంశమయ్యారు. ముస్లిం అయిన ఆమె పూజలు చేయడంపై రెండు వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.
తాజాగా మరోమారు పూజలకు హాజరయ్యారు నుష్రత్ జహాన్. విమర్శలను లెక్కచేయకుండా కోల్‌కతాలోని చట్లబగన్ దుర్గా మండపంలో ఏర్పాటు చేసిన 'సిందూర్ ఖేలా' కార్యక్రమంలో పాల్గొన్నారు. భర్త నిఖిల్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
"నేను దేవుడి ప్రత్యేక బిడ్డను. నేను అన్ని పండుగలను జరుపుకుంటాను. అన్నింటికన్నా ఎక్కువగా మానవత్వం, ప్రేమను గౌరవిస్తాను. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు."
- నుష్రత్ జహాన్, టీఎంసీ ఎంపీ
ఇదీ చూడండి: 'అమెరికా అధ్యక్షుడైనా కశ్మీర్ గురించి మాట్లాడొద్దు'