ETV Bharat / bharat

గవర్నర్​ను తొలగించాలని రాష్ట్రపతికి టీఎంసీ లేఖ

బంగాల్ గవర్నర్​ జగదీప్​ ధన​కర్‌ను పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని అభ్యర్థించింది తృణమూల్ కాంగ్రెస్​(టీఎంసీ). ధనకర్​​.. రాజ్యాంగాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తరచు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు టీఎంసీ ఎంపీలు.

author img

By

Published : Dec 30, 2020, 5:38 PM IST

TMC moves President to remove Dhankhar from Bengal Guv post
గవర్నర్​ను తొలగించాలని రాష్ట్రపతికి టీఎంసీ లేఖ

బంగాల్​లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. బంగాల్​లో ఎలాగైనా తమ జెండా పాతాలని భావిస్తున్న భాజపా ఎత్తులకు ఘాటుగా స్పందిస్తోంది తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ). ఈ క్రమంలో రాష్ట్ర​ గవర్నర్​ జగదీప్​ ధన​కర్​ను తొలగించాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు విజ్ఞప్తి చేసింది టీఎంసీ. గవర్నర్​.. రాజ్యాంగ పరిధి ధాటి వ్యవహరించడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం, పాలన యంత్రాంగానికి వ్యతిరేకంగా పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది.

ధనకర్​ను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రపతికి లేఖ రాసింది టీఎంసీ ఎంపీల బృందం. ఈ లేఖలో రాజ్యసభ టీఎంసీ ఎంపీ సుఖెందు శేఖర్​ రాయ్​ సహా ఎంపీ కల్యాణ్​ బెనర్జీ, సుదీప్ బందోపాధ్యాయ, డెరెక్​ ఒబ్రెయిన్​, కకోలి ఘోష్​ దస్తీదర్​ సంతకాలు చేశారు.

రాష్ట్ర గవర్నర్​గా నియమితులైనప్పటినుంచీ రాజ్యాంగ పరిమితులను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, మంత్రులకు వ్యతిరేకంగా ధనకర్​ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని రాయ్ ఆరోపించారు. కేంద్రంలోని భాజపా సర్కారు ఆదేశాలనుసారమే బంగాల్​లో టీఎంసీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. 75 ఏళ్ల బంగాల్​ చరిత్రలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదన్నారు.

అయితే రాజ్యాంగ పరిధికి లోబడే గవర్నర్​ వ్యవహరిస్తున్నారని స్పందించింది భాజపా. ​

ఇదీ చూడండి: 'ధర్మెగౌడ ఆత్మహత్యపై ఉన్నత స్థాయి విచారణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.