తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనను సంప్రదిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తే తృణమూల్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తుడిచిపెట్టేస్తామని మోదీ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ దీటుగా స్పందించింది. ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రెయిన్ మోదీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ట్వీట్ చేశారు.
"మీ వెంట ఎవరూ రారు. తృణమూల్ ఎమ్మెల్యేలు కాదుకదా కనీసం మా పార్టీకి చెందిన ఒక్క కౌన్సిలర్ కూడా మీ వెంట రారు. మీకు కాలం చెల్లే రోజు దగ్గరలోనే ఉంది." - ట్విట్టర్లో డెరెక్ ఓబ్రెయిన్
- ఇదీ చూడండి: మోదీ, రాహుల్ వ్యాఖ్యలపై నేడు ఈసీ నిర్ణయం