టిక్‌టాక్ యాప్ నిర్వాహకులకు సుప్రీంలో చుక్కెదురైంది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై అత్యవసరంగా పునర్విచారణ చేయాలని కోరుతూ టిక్‌టాక్ నిర్వాహక సంస్థ బైట్‌డాన్స్ సుప్రీంను ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. టిక్‌టాక్‌పై అత్యవసర విచారణ కుదరదని తేల్చింది.
యాప్‌లో అశ్లీలతను ప్రోత్సహించే సమాచారం ఉందని దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించింది మద్రాస్ హైకోర్టు. టిక్‌టాక్ డౌన్లోడ్పై నిషేధం విధించాలని ఏప్రిల్ 3న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి: భారతీయ జనతా పార్టీ 'విజయ సంకల్పం'