భారత్ పర్యటనకు వచ్చిన అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్‌కు విలువైన కానుకలు ఇచ్చారు ప్రధాని మోదీ. ట్రంప్ సతీసమెతంగా సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో చారిత్రకమైన రోజుకు గుర్తుగా.. మహాత్ముని ఆదర్శాలకు ప్రతిరూపాలైన మూడు కోతుల పాలరాతి ప్రతిమ, చరఖాను బహుమతిగా ఇచ్చారు.
చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని గాంధీజీ పవిత్ర సందేశాన్ని సూచించే మూడు కోతుల ప్రతిమను భారత ప్రభుత్వం తరఫున ట్రంప్‌కు బహుకరించారు మోదీ. ఈ సందర్భంగా వాటి విశిష్టతను ట్రంప్ దంపతులకు వివరించారు. వీటితో పాటు జాతిపిత ఆత్మకథ పుస్తకం, గాంధీజీ రక్షరేకు నకలును బహుమతులుగా ఇచ్చారు. మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో.. విడుదలైన హౌడీ మోదీ పుస్తకాన్ని ట్రంప్‌కు అందించారు ప్రధాని.
ఇదీ చూడండి: 'నమో'స్తే ట్రంప్: ఆరు కౌగిలింతలు- లెక్కలేనన్ని ప్రశంసలు