తమిళనాడు తూత్తుకుడిలో ముగ్గురు బాలురు.. పోలీసుల వాహనంపై టిక్‌టాక్ వీడియో చేశారు. అది బాగా వైరల్ కావటం వల్ల పోలీసుల కళ్లల్లో పడింది. వీడియోపై ఆరా తీశారు. బాధ్యులైన ముగ్గురు కుర్రాళ్లు.. షిను, గోకులకృష్ణన్, సెకురాలను మందలించి రోజంతా ట్రాఫిక్ నియంత్రించాలని ఆదేశించారు.
ఈ విషయంపై స్పందించిన తూత్తుకుడి డిప్యూటీ ఎస్పీ ప్రకాశ్.. ఇది శిక్ష కాదన్నారు. గేలి చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయలేదని.. అందుకు ప్రతిగా పోలీసుల సేవలో భాగస్వాములం అవుతామని వాళ్లే అడిగారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్న వారి కోరిక మేరకు అంగీకరించామని ఎస్పీ చెప్పారు.