ETV Bharat / bharat

'ఐదేళ్లలో మూడు మెరుపు దాడులు' - దాడులు

గత ఐదేళ్లలో భారత్​ పాకిస్థాన్​పై మూడు సార్లు మెరుపు దాడులు చేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్​సింగ్ ఉద్ఘాటించారు. రెండింటి విషయం అందరికీ తెలుసని మూడవ దాడి వివరాలు వెల్లడించడం కుదరదన్నారు.

ఐదేళ్లలో మూడు మెరుపు దాడులని ప్రకటించిన రాజ్​నాథ్​సింగ్
author img

By

Published : Mar 9, 2019, 11:29 PM IST

భారత్​ గత ఐదేళ్ల కాలంలో మూడు సార్లు దాయాది పాకిస్థాన్​పై దాడులు జరిపిందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్ సింగ్. భారత్ ఇక ఏమాత్రం బలహీన దేశం కాదని ఉద్ఘాటించారు రాజ్​నాథ్. విభేదాలన్నింటిని పక్కనపెట్టి దేశం కోసం నిలబడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయన్నారు. వైమానిక దాడులు సైనిక చర్య కాదని అక్కడ సాధారణ పౌరులకు నష్టం జరగలేదని స్పష్టం చేశారు. భారత్​లో మరిన్ని దాడులకు కుట్ర చేస్తున్నందునే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టాల్సి వచ్చిందన్నారు.

పుల్వామా ఘటన అనంతరం చేపట్టిన వైమానిక దాడులతో దీటైన సమాధానమిచ్చాం అని రాజ్​నాథ్ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వంత పాడటం కొనసాగిస్తే పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భారత్​ ఎవరిపైనా విద్వేషాలు రెచ్చగొట్టదని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించదన్నారు.

ఐదేళ్లలో మూడు మెరుపు దాడులని ప్రకటించిన రాజ్​నాథ్​సింగ్

"గత ఐదేళ్లలో మూడుసార్లు పాకిస్థాన్​లోకి చొచ్చుకెళ్లి మెరపుదాడులు నిర్వహించాం. రెండు నేను చెప్పగలను. కానీ మరొకటి చెప్పలేను. పాకిస్థాన్​ నుంచి ఉగ్రవాదులు చొరబడి మన సైనికులపై దాడి చేశారు. బదులుగా ఉరీ ఘటనతో మనం సమాధానమిచ్చాం. పాకిస్థాన్​ భూభాగంలోకి ప్రవేశించాం. మీకందరికి తెలుసు. రెండోది పాక్​ గగనతలంలోకి ప్రవేశించి వైమానిక దాడి చేశాం. మూడవ దాడి వివరాలు నేను చెప్పలేను." -రాజ్​నాథ్​సింగ్, కేంద్ర హోంమంత్రి

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తోన్న పోరాటాన్ని దేశంలోని ఏ శక్తి ఆపలేదని ప్రతిపక్షాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భాజపా సున్నా సీట్ల నుంచి 2014లో సంపూర్ణ మెజారిటీ సాధించే వరకు ఎదిగిందని గుర్తు చేశారు రాజ్​నాథ్. అత్యధిక సభ్యులతో భాజపా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు.

ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాలు అత్యంత శక్తిమంతమైన దేశాలు. 2028 నాటికి భారత్ ఆ దేశాల సరసన నిలబడుతుందని రాజ్​నాథ్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లోభారత్ఒకటని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:"మసూద్​ను విడిచిపెట్టింది మీరు కాదా..?"

Paraguay, Mar 07 (ANI): In a visit to Paraguay, Vice President Venkaiah Naidu addressed India-Paraguay Business Forum on Thursday. Paraguay's Industry and Commerce Minister Liz Cramer Campos was also present at the event. VP Naidu remarked on sectors where complementarities exist and need to be explored for mutual benefit.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.