ETV Bharat / bharat

ఒకే వేదికపై ముగ్గురు కవల అక్కాచెల్లెళ్ల పెళ్లి - కవల అక్కాచెల్లెళ్ల వివాహం

కేరళలోని త్రిస్సూర్​లోని గురవాయుర్​ ఆలయం.. అరుదైన వివాహ వేడుకకు వేదికైంది. ముగ్గురు కవల అక్కాచెల్లెళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. 1995లో జన్మించిన ఐదుగురు కవలల్లోని ముగ్గురే వీరు.

Three sisters of the quintuplets from Thiruvananthapuram in Kerala got married at the Guruvayur Temple
కేరళలో ఒకేసారి పెళ్లి చేసుకున్న ముగ్గురు కవల అక్కాచెల్లెళ్లు
author img

By

Published : Oct 24, 2020, 4:27 PM IST

Updated : Oct 24, 2020, 5:00 PM IST

కేరళ తిరువనంతపురానికి చెందిన ఐదుగురు కవలల్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. త్రిస్సూర్​లోని గురువాయుర్ ఆలయం ఈ అరుదైన వివాహ వేడకకు వేదికైంది. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మూడు కొత్త జంటలు ఒక్కటయ్యాయి.

ఒకే వేదికపై ముగ్గురు కవల అక్కాచెల్లెళ్ల పెళ్లి

1995లో పంచరత్నాలు..

తిరవనంతపురంలోని పోథన్​కోడ్​కు చెందిన ప్రేమ్​ కుమార్, రమా దేవి దంపతులకు 1995 నవంబర్ ​18న ఐదుగురు కవలలు జన్మించారు. వీరిలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అప్పట్లో ఈ విషయం పెద్ద వార్తాంశమైంది. ఐదుగురు కవలలను పంచరత్నాలుగా అభివర్ణించారు.

ఈ పంచరత్నాల్లోని ముగ్గురే ఇప్పుడు వివాహం చేసుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్​గా పనిచేస్తున్న ఉథ్రా.. మస్కట్​లో హేటల్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్న కేఎస్​ అజిత్​ కుమార్​ను మనువాడింది. డిజిటల్ మీడియా వృత్తిలో స్థిరపడిన ఉథారా.. కోజికోడ్​కు చెందిన జర్నలిస్ట్ కేబీ మహేశ్ కుమార్​ను​ పెళ్లిచేసుకుంది. అనెస్తేషియా టెక్నీషియన్​గా పనిచేస్తున్న మరో సోదరి ఉత్తమ.. మస్కట్​లో అకౌంటెంట్​గా పనిచేస్తున్న వినీత్​ను పరిణయమాడింది. ఐదుగురు కవలల్లోని ఒకే ఒక్క సోదరుడు ఉత్తరాజన్​.. ఈ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకున్నాడు.

ఈ కవలల తండ్రి ప్రేమ్​కుమార్​ వారి 9వ ఏటనే మరణించారు. అప్పటి నుంచి రమా దేవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వారిని పెంచి పెద్ద చేశారు. జిల్లా సహకార బ్యాంకులో ఉద్యోగం చేస్తూ కుటుంబ కష్టాలను అధిగమించారు. కొద్దిరోజులుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న రమా దేవి.. ప్రస్తుతం పేస్​మేకర్​ సాయంతో జీవనం సాగిస్తున్నారు.

Last Updated : Oct 24, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.