పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. గురునానక్ పురా ప్రాంతంలో ఓ భవనం పైకప్పు కూలి.. ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గత రాత్రి కురిసిన భారీ వర్షం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
![Three people killed, four injured after roof of a building collapses in Amritsar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8587941_2.jpg)
![Three people killed, four injured after roof of a building collapses in Amritsar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8587941_1.jpg)
గుజరాత్‌లోనూ..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున రెండంతస్తుల పురాతన భవనం కూలిపోయింది. కుబేర్నగర్లో జరిగిన ఈ ఘటనలో అక్కడిక్కడే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: చికెన్ షాపుకెళ్లి చెయ్యి తెగనరుక్కుని...