కర్ణాటక తుమకూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గుబ్బి తాలూకా దొబ్బగుని సమీపంలో.. 206 జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు, ఓమ్ని వ్యాను ఢీకొన్నాయి. మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
బెంగళూరు నుంచి శివమొగ్గకు ప్రయాణిస్తున్న బస్సు తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. నరసమ్మ అనే వృద్ధురాలు సహా 55 ఏళ్ల వయసున్న వసంతకుమార్, రామయ్య అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:మగ పులి దాడిలో 'దామిని'కి గాయాలు.. మృతి