ETV Bharat / bharat

దేశంలో వెయ్యి దాటిన కరోనా కేసులు

కరోనా కేసులు దేశంలో రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వెయ్యి మందికిపైగా వైరస్​ సోకింది. మరో 27 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. 24 గంటల వ్యవధిలో 106 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. స్పైస్​జెట్​ విమానయాన సంస్థకు చెందిన ఒక పైలట్​ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.

Three more COVID-19 cases in Bengal, count now 21
దేశంలో వెయ్యి దాటిన కరోనా కేసులు
author img

By

Published : Mar 30, 2020, 5:41 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. మొత్తంగా 1024 మందికి వైరస్​ సోకగా.. 27 మంది మరణించినట్లు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. 95 మంది కోలుకున్నారని.. ఒకరు దేశం విడిచివెళ్లడం వల్ల ప్రస్తుతం మరో 901 ఆక్టివ్​ కేసులున్నాయని అధికారులు ప్రకటించారు.

మృతుల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా ఆరుగురు కొవిడ్​-19 ధాటికి ప్రాణాలు విడిచారు. గుజరాత్​లో ఐదుగురు, కర్ణాటకలో ముగ్గురు మరణించారు.

దిల్లీ, మధ్యప్రదేశ్​, జమ్ము కశ్మీర్​లలో ఇద్దరు చొప్పున, కేరళ, తమిళనాడు, బిహార్​, తెలంగాణ, బంగాల్​, పంజాబ్​, హిమాచల్​ ప్రదేశ్​లు ఒక్కొక్క మరణాన్ని ధ్రువీకరించాయి. పంజాబ్​లో ఆదివారం రాత్రి మరొకరు మరణించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

Three more COVID-19 cases in Bengal, count now 21
దేశంలో వెయ్యి దాటిన కరోనా కేసులు

కేసుల పరంగా మహారాష్ట్ర ముందుంది. రాష్ట్రంలో 186 మందికి వైరస్​ సోకినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. కేరళలో 182, కర్ణాటకలో 76 మంది వైరస్​ బారిన పడ్డారు.

తెలంగాణ 66, ఉత్తర్​ప్రదేశ్​ 65, గుజరాత్​ 58 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.