ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఐదుగురు ప్రజాప్రతినిధులకు కరోనా

కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. మహారాష్ట్రలోనూ ఓ మంత్రికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

Three ministers, two MLAs test COVID-19 positive in Sikkim
ఆ రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
author img

By

Published : Sep 19, 2020, 10:43 PM IST

సిక్కింలో ముగ్గురు మంత్రులు సహా ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు.

సోమవారం(సెప్టెంబర్​ 21) అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో చట్టసభ్యులు, సిబ్బందికి శుక్రవారం.. కరోనా పరీక్షలు నిర్వహించారు. సమాచార, ప్రజా వ్యవహారాల శాఖ మంత్రి లోక్​నాథ్​ శర్మ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కర్మా భుటియా, విద్యుత్​ శాఖ మంత్రి మింగ్మా నోర్బూలకు పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.

మరో ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ఫర్వాంటి తమంగ్​, టీటీ భుటియాలకూ కరోనా సోకింది. వీరంతా ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

మహారాష్ట్రలోనూ మంత్రికి..

మహారాష్ట్రలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పాఠశాల విద్యా శాఖ మంత్రి బచ్చూ కడూకు కొవిడ్​-19 సోకినట్లు తేలింది. ఆయన శనివారం మధ్యాహ్నం.. ఎంఎస్​ఈడీసీఎల్​ కాంట్రాక్ట్​ ఉద్యోగులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన వైద్య పరీక్షల్లో.. ఆయనకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

రమణ్​సింగ్​కు కరోనా..

ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్​ నేత రమణ్​ సింగ్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​లో వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా టెస్టు చేయించుకోవాల్సిందిగా కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.