ETV Bharat / bharat

'సాగు చట్టాల్లో మార్పులతోనే రైతులకు మేలు' - భారతీయ కిసాన్​ సంఘ్​ జాతీయ కార్యదర్శి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాలపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ అనుబంధ రైతు విభాగం భారతీయ కిసాన్​ సంఘ్​. నూతన చట్టాలు రైతుల కోసం కాదని, వ్యాపారుల కోసమేనని ఆరోపించారు కిసాన్​ సంఘ్​ జాతీయ కార్యదర్శి మోహిని మోహన్​ మిశ్రా. రైతులకు మేలు జరగాలంటే కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Bhartiya Kisan Sangh
మోహిని మోహన్​ మిశ్రా
author img

By

Published : Oct 28, 2020, 1:21 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. విపక్షాల నుంచే కాకుండా పలు భాగస్వామ్య పార్టీలూ కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టాయి. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​(ఆర్​ఎస్​ఎస్​) అనుబంధ రైతు విభాగం భారతీయ కిసాన్​ సంఘ్​ కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతుల కోసం కాదని, వ్యాపారుల కోసమేనని ఆరోపించింది. అయితే.. పార్లమెంట్​లో బిల్లులు ఆమోదం పొందిన సమయంలో కిసాన్​ సంఘ్​ స్వాగతించినప్పటికీ.. పలు సూచనలు, డిమాండ్లను కేంద్రం ముందు ఉంచినట్లు పేర్కొంది.

ఈ అశంపై ఈటీవీ భారత్​తో కీలక విషయాలు పంచుకున్నారు భారతీయ కిసాన్​ సంఘ్​ జాతీయ కార్యదర్శి మోహిని మోహన్​ మిశ్రా.

మోహిని మోహన్​ మిశ్రా, భారతీయ కిసాన్​ సంఘ్​ జాతీయ కార్యదర్శి

" మూడు వ్యవసాయ చట్టాల్లో వ్యాపారులకే మేలు జరుగుతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, రైతులకు మేలు జరగాలంటే చట్టాల్లో మార్పులు చేయాలి. లేని పక్షంలో రైతులు, వ్యాపారుల ఉచ్చులో చిక్కుకుని నష్టపోతారు. అలాగే నూతన చట్టాలు రైతులు తమ పంటలను దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నాయి. రైతులు తమ సొంత ఉత్పత్తుల వ్యాపారులుగా మారేందుకు అధికారం ఇస్తున్నాయి. "

- మోహిని మోహన్​ మిశ్రా, కిసాన్​ సంఘ్​ జాతీయ కార్యదర్శి

ఒకే దేశం- ఒకే మార్కెట్​ విధానం, మండీల్లో పన్ను రద్దు వంటి నిర్ణయాలను స్వాగతించింది కిసాన్​ సంఘ్​. పంట ఉత్పత్తుల చెల్లింపులపై భద్రత కల్పించాలని సూచన చేసినట్లు చెప్పారు మిశ్రా. దాని ద్వారా రైతులకు బ్యాంకు గ్యారంటీ లభిస్తుందన్నారు.

" ఆర్డినెన్స్​ తీసుకొచ్చినప్పటి నుంచి పలు మార్పులు చేయాలని భారతీయ రైతు సంఘం డిమాండ్​ చేస్తోంది. సాధారణంగా రైతు ఉత్పత్తులను నాణ్యత పేరిట తిరస్కరించటం, తరువాత తక్కువ ధరకు కొనుగోలు చేయడం మండీల్లో తరచూ జరుగుతుంది. ఈ సమస్యపై రైతుల్లో అసహనం నెలకొంది. ఆ పద్ధతికి తెరదించాలి. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు, కంపెనీల వివరాలు ప్రభుత్వ పోర్టల్​లో అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం, పాన్​ కార్డు ఉన్న ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. అయితే.. పూర్తిస్థాయి సమాచారం ప్రభుత్వం, రైతుల వద్ద ఉండాలనేది మా ప్రధాన డిమాండ్​."

రైతులతో చర్చించి ఉంటే..

కిసాన్​ సంఘ్​ ప్రధానంగా చేస్తున్న డిమాండ్​ కనీస మద్దతు ధర గురించేనని తెలిపారు మిశ్రా. మార్కెట్లో కానీ, ఎక్కడైనా ఎంఎస్​పీ కన్నా తక్కువకు కొనుగోలు చేయకుండా భరోసా కల్పించాలని పేర్కొన్నారు. ఈ అంశాన్ని నూతన చట్టాల్లో చేర్చాలని డిమాండ్​ చేశారు. వ్యవసాయ చట్టాల్లో సంస్కరణలు చేసే ముందు రైతులతో చర్చించాల్సిందని, కానీ ప్రభుత్వం వ్యాపారులతో చర్చించి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు మిశ్రా. వారికి అనుకూలంగానే చట్టాలు చేశారని పేర్కొన్నారు. రైతులతో చర్చించి ఉంటే వారి ఆలోచనలను ప్రభుత్వం ముందు ఉంచేవారని తెలిపారు.

ఇదీ చూడండి: సాగు చట్టాల గురించి సగం మంది రైతులకు తెలీదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.