ఈశాన్య రాష్ట్రాలను వరుస భూకంపాలు కుదిపేశాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో నిమిషాల వ్యవధిలో 3 సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 5.6, 3.8, 4.9గా నమోదయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
మొదటిసారి మధ్యాహ్నం 2.52 గంటలకు 5.6 తీవ్రతతో కంపించినప్పుడు తూర్పు కమెంగ్ జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావానికి ఇటానగర్, అసోంలోని గువాహటి, నాగాలాండ్‌లోని డిమాపుర్లో స్వల్ప ప్రకంపనలు ఏర్పడ్డాయి.
అనంతరం మధ్యాహ్నం 3.04 గంటలకు 3.8 తీవ్రతతో ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. మరోసారి మధ్యాహ్నం 3.21 గంటలకు 4.9 తీవ్రతతో కురుంగ్ కుమే జిల్లాలో 95 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది.
ఇదీ చూడండి: బిహార్: పిడుగుపాటుకు ఏడుగురు చిన్నారుల మృతి