భారత్‌లో కరోనా తీవ్రంగా మహారాష్ట్రలో మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 891 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ 23 మందికి కరోనా సోకగా.. ముంబయి నుంచే 10 మంది ఉన్నట్లు పేర్కొంది. పుణెలో ఇవాళ మరో ముగ్గురు కరోనా సోకి మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 55కు చేరినట్లు సమాచారం.
ఒడిశాలో తొలి మరణం...
ఒడిశాలో సోమవారం మరణించిన 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో ఇదే తొలి కరోనా మరణం. ఇప్పటివరకు రాష్ట్రంలో 42 మందికి కొవిడ్-19 సోకింది.
ఒడిశా నిఘా విభాగం(ఐబీ) కార్యాలయ సిబ్బందిలో ఒకరు.. కరోనా బాధితునికి సన్నిహితంగా మెలిగిన కారణంగా ఆఫీసును మూసివేసింది భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్. ఉద్యోగులందరినీ 14 రోజుల క్వారంటైన్లో ఉంచింది.
19 కేసులు.. 2 మరణాలు
గుజరాత్లో ఇవాళ మరో 19 కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య 165కు చేరింది. నేడు మరో ఇద్దరు మరణించగా.. మృతుల సంఖ్య 14కు చేరినట్లు అధికారులు ప్రకటించారు.
మిగతా రాష్ట్రాల్లో...
- ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు మరణించగా.. మృతుల సంఖ్య 4కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు 304.
- కర్ణాటకలో 12 కొత్త కేసులుతో మొత్తం ఆ సంఖ్య 175కు చేరింది. 25 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో 4 మరణాలు నమోదయ్యాయి.
- మధ్యప్రదేశ్‌లో మరో 12 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక్కడ బాధితుల సంఖ్య 268కి చేరింది.
- గోవాలో ఇప్పటివరకు ఏడుగురు కరోనా బారిన పడ్డారు. మరో 15 మంది కరోనా అనుమానితులకు నెగటివ్‌గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు.