దేశాన్ని పోషించే అన్నదాతలను అవమానించేవారు ఎప్పటికీ దేశభక్తులు కాలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లోని అధికార భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాహుల్. రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.
"మీ (భాజపా) వైఫల్యాలు మీవే. వాటిని కప్పిపుచ్చుకోవడానికి రైతులను ఎందుకు శిక్షిస్తున్నారు. మన రైతులే మనకు జీవితాన్నిస్తున్నారు. వారిపై ఎలాంటి దురాగతాలకు పాల్పడినా అది దేశంపైన దురాగతానికి పాల్పడినట్లే అవుతుంది. రైతులను అవమానించేవారు ఎవరైనా, వారు ఎన్నటికీ దేశభక్తులు కాలేరు."
- ఫేస్బుక్ పోస్ట్‌లో రాహుల్‌గాంధీ
ఉత్తర్‌ప్రదేశ్ చెరకు రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.10,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించలేదన్న ఓ మీడియా నివేదికను రాహుల్ తన ఫేస్బుక్ పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. యూపీలో మొదటి విడత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ అధికార పక్షం వైఫల్యాలపై విమర్శల పర్వం కొనసాగిస్తూ ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చూడండి :డైరీ ఉదంతంలో సుర్జేవాలాపై భాజపా ఫిర్యాదు
ఇదీ చూడండి :'అప్పుడు స్వతంత్రం- ఇప్పుడు ప్రజాస్వామ్యం'