తమిళనాడులోని తూత్తుకుడి నగరపాలక సంస్థ అధికారులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్ కేంద్రాల నుంచి సేకరించిన, వాడి పడేసిన వాటర్ బాటిళ్లతో శౌచాలయాలను నిర్మించి పలువురి మన్ననలు పొందుతున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ పథకం కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. ప్రయోగాత్మకంగా తూత్తుకుడి కార్పొరేషన్ పరిధిలోని పెరుమాళపురంలో ఈ నిర్మాణాలను చేపట్టారు.
సేకరించేటప్పుడే బాటిళ్లను పూర్తిగా శుభ్రపరిచారు. ఆ బాటిళ్లలో సముద్రపు ఇసుకను నింపి, ఇటుకలకు ప్రత్యామ్నాయంగా వినియోగించారు. ఇటుకలతో శౌచాలయాలు నిర్మించడానికి రూ.3 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తే.. ఈ బాటిళ్లతో నిర్మించడం వల్ల అందులో సగం ధరకే పూర్తవుతోందని చెబుతున్నారు అధికారులు. సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు. త్వరలోనే మరిన్ని టాయిలెట్లను బాటిళ్లతో నిర్మిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:ఆమె రొట్టెలకు భలే గిరాకీ.. 200 మందికి ఉపాధి