ప్రధాని నరేంద్ర మోదీపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీల తర్వాత దేశంలోనే అత్యంత ప్రజాకర్షణ శక్తి ఉన్న నేత నరేంద్రమోదీనేనని కొనియాడారు. ఈ నెల 30న జరిగే మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు.
బలమైన ప్రతిపక్షం అవసరం..
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత తీసుకుంటూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధ పడుతున్న రాహుల్‌గాంధీ గురించీ రజనీ స్పందించారు. రాహుల్ తనను తాను నిరూపించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి సరిసమానంగా ప్రతిపక్షమూ బలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడు అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని రజనీకాంత్ కోరారు.
ఇదీ చూడండి: 'ఆహ్వానించకపోవటం పెద్ద అంశమేం కాదు'