కేరళ మలప్పురం జిల్లాలోని ఇరింగత్తిరి కరువరకుండు గ్రామానికి చెందిన నూనంపర కోజి అనే రైతు.. కొండప్రాంతాల్లో తనకున్న రెండున్నర ఎకరాల్లో వరిని సాగుచేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
రబ్బరు పండిన పొలంలో ధాన్యం
నూనంపర కోజి, తన పొలంలో గతంలో రబ్బరు పంట సాగు చేశాడు. అయితే ఇప్పుడు అదే పొలంలో వరి పంటను పండిస్తున్నాడు. ఇందుకు నేలను చదును చేసి వరి పంటకు అనువుగా సిద్ధం చేశాడు. ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉంది.
'వరి పంటే నా ఫేవరేటు'
సాధారణంగా కొండ ప్రాంతాల్లో పండించే పంటలకు ఏనుగుల బెడద ఉంటుంది. కానీ వరి పంట మీద ఉన్న మక్కువతో నూనంపర కోజి ధైర్యంగా పంట సాగు చేస్తున్నాడు. ఎన్నో రకాల పంటలు పండించినా.. వరి సాగు మాత్రమే తనకు ఇష్టమని చెబుతున్నాడు. పంట దిగుబడి తక్కువ వచ్చినా, వరి సాగు లేకుండా వ్యవసాయం పూర్తి కాదంటున్నాడు.
పలు కార్యక్రమాల్లో పాల్గొని
కురువకుండు గ్రామ పంచాయితీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు నూనంపర కోజి పాల్గొనేవాడు. ఈ కార్యక్రమాలే.. కొండప్రాంతంలో వరిని సాగుచేయటానికి స్ఫూర్తినిచ్చిందని అంటున్నాడు.
ఇదీ చదవండి :3 టన్నుల యాపిల్స్‌తో మహావీర్ ఆలయంలో పూజలు