సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో 117 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని ఆయా స్థానాల నుంచి మొత్తం 1640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఓటర్ల సంఖ్య 18 కోట్ల 85.
భారీ ఏర్పాట్లు...
మూడో దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 2లక్షల 10 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలు నెలకొల్పింది. మొదటి రెండు విడతల్లో ఈవీఎంలు మొరాయింపు ఎన్నికల సంఘానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈసారి ఈవీఎంలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈసీ. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
ప్రముఖుల భవితవ్యం...
భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే, ములాయం సింగ్ యాదవ్, జయప్రద, ఆజంఖాన్ వంటి ప్రముఖులు మూడో దశలోనే అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
ఓటరులారా.... తరలిరండి: మోదీ
మూడో విడతలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదుచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు విలువైనదని, రాబోయే సంవత్సరాల్లో దేశ గతిని నిర్ణయిస్తుందని ట్వీట్ చేశారు.
-
Urging all those voting in today’s Third Phase of the 2019 Lok Sabha elections to do so in record numbers. Your vote is precious and will shape the direction our nation takes in the years to come.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
I’ll be voting in Ahmedabad in a short while from now.
">Urging all those voting in today’s Third Phase of the 2019 Lok Sabha elections to do so in record numbers. Your vote is precious and will shape the direction our nation takes in the years to come.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 23, 2019
I’ll be voting in Ahmedabad in a short while from now.Urging all those voting in today’s Third Phase of the 2019 Lok Sabha elections to do so in record numbers. Your vote is precious and will shape the direction our nation takes in the years to come.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 23, 2019
I’ll be voting in Ahmedabad in a short while from now.